మన టాలీవుడ్ హీరోలు సినిమా సినిమాకు కొత్త కొత్త మేకోవర్ లు మార్చేస్తున్నారు. ఒక సినిమాలో ఉన్న లుక్ ను మరొక సినిమాలో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడంలేదు. ఎంతకష్టమైనా సరే సినిమాకోసం ఇష్టంగా చేస్తుంటారు. ఇక ఇదిలా ఉండగా మొన్నటివరకూ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రఫ్ లుక్ లో కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం రెడీ అయిపోతున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈఫొటోలో తారక్ స్లిమ్ గా కనిపించడంతోపాటు ట్రిమ్డ్ లుక్ లోకి వచ్చి సరికొత్త స్టైల్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఎన్టీఆర్ కూల్ లుక్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవ్వడమే కాదు.. ఎన్టీఆర్ సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్నాడు ఎన్టీఆర్. ఈసినిమా ప్రస్తుతం ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇక ఈసినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాలతో సినిమా చేయనున్నాడు. ఈసినిమాకు కూడా ఇప్పటికే సెట్స్ పైకి తీసుకెళ్లాలి కానీ చాలా గ్యాప్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా లేట్ అవ్వడం.. కరోనా.. ఎన్టీఆర్ చేతికి కూడా మధ్యలో గాయం అవ్వడం ఇలా పలుకారణాల వల్ల ఈసినిమా లేట్ అయింది. త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు చిత్రయూనిట్.
కాగా యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో ఎన్టీఆర్ సరసన అలియా హీరోయిన్ గా నటిస్తుందన్న వార్తలు వచ్చాయి. అయితే క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇంకా ఈసినిమాలో నటించే నటీనటులు.. సాంకేతిక నిపుణుల గురించి తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: