కరోనా థర్డ్ వేవ్ ప్రభావం సినీ సెలబ్రిటీలు మీద గట్టిగానే పడుతుంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఒకరు కోలుకునేలోపే మరొకరు కరోనా బారిన పడుతున్నారు.
రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో కరోనాబారిన పడ్డ చిరు ప్రస్తుతం ఇంట్లో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో చిరు అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు చిరు అమ్మగారి పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరు ప్రేమతో తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ అందించారు. ఈ సందర్భంగా చిరు తన ట్వీట్ లో.. అమ్మా! జన్మదిన శుభాకాంక్షలు. క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా.. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ అభినందనలతో …. శంకరబాబు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
అమ్మా !🌻💐
జన్మదిన శుభాకాంక్షలు 🌷🌸క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ 🙏
అభినందనలతో …. శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3p
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022
ఇక చిరు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అందులో ఆచార్య సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మరోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమా చేస్తున్నారు. ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. ఇటీవలే ‘భోళా శంకర్’ సినిమాను కూడా ప్రారంభించారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు బాబి దర్శకత్వంలో వస్తున్న సనిమాను కూడా స్టార్ చేసేశాడు. వీటితోపాటు యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో కూడా రీసెంట్ గానే సినిమా కమిట్ అయ్యారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























