“ఎవరు మీలో కోటీశ్వరులు “షో లో మహేష్ బాబు , ఎన్టీఆర్ సందడి

Evaru Meelo Koteeswarulu Jr NTR And Mahesh Babu Episode Highlights,Evaru Meelo Koteeswarulu Jr NTR,Telugu Filmnagar,Jr NTR,Jr NTR Latest Movie,Jr NTR New Movie,Jr NTR Movies,Jr NTR Latest News,Evaru Meelo Koteeswarulu TV Show,Evaru Meelo Koteeswarulu,Evaru Meelo Koteeswarulu Show,Jr NTR Evaru Meelo Koteeswarulu,Evaru Meelo Koteeswarulu Host Jr NTR,Telugu Game Show Evaru Meelo Koteeswarulu,Evaru Meelo Koteeswarulu Guest,Jr NTR Evaru Meelo Koteswarulu Guest,Jr NTR Telugu Game Show Evaru Meelo Koteswarulu,Evaru Meelo Koteswarulu Mahesh Babu Episode,Evaru Meelo Koteeswarulu Mahesh Babu,Jr NTR Telugu Game Show,Jr NTR Telugu TV Show,Jr NTR TV Show,Jr NTR Quiz Show,Jr NTR And Mahesh Babu Episode,Evaru Meelo Koteswarulu Guest Mahesh Babu,Mahesh Babu And Jr NTR’s EMK Show,EMK,EMK Show,Evaru Meelo Koteeswarulu Mahesh Babu,Jr NTR And Mahesh Babu EMK,Main Highlights Of Jr NTR Mahesh Babu Episode,Evaru Meelo Koteeswarulu With Mahesh Babu,Main Highlights Of Jr NTR Mahesh Babu Episode,Evaru Meelo Koteeswarulu With Mahesh Babu,Evaru Meelo Koteeswarulu Mahesh Babu Full Episode,Evaru Meelo Koteeswarulu Mahesh Babu Episode,Evaru Meelo Koteeswarulu Mahesh Babu Episode Highlights,Evaru Meelo Koteeswarulu Jr NTR And Mahesh Babu Episode,Mahesh And Jr NTR EMK Episode,Jr NTR And Mahesh Babu Episode Highlights,Evaru Meelo Koteeswarulu Mahesh Babu Episode Main Highlights,EMK Promo,Gemini TV,#NTR,#EvaruMeeloKoteeswarulu,#MaheshBabu,#EMK

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హోస్ట్ గా జెమినీ టీవీలో “ఎవరు మీలో కోటీశ్వరులు” ఐదో సీజన్‌ షో రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఆదివారం ఎపిసోడ్‌తో ఈ సీజన్‌ని పూర్తి చేసుకుంది. “ఎవరు మీలో కోటీశ్వరులు”నిర్వా హకులు, ఎన్టీఆర్ కోరిక మేరకు మహేష్‌ ఈ షోలో సందడి చేశారు. ఈ షో లో మహేష్ బాబు , ఎన్టీఆర్ ల మధ్య చోటు చేసుకున్న సన్నివేశాలు, ఇద్దరి మధ్య డిస్కషన్‌ ఆద్యంతం నవ్వులు పూయించి ప్రేక్షకులను అలరించాయి. మహేష్ బాబు ను ఆటపట్టిస్తూ ఎన్టీఆర్ ఇరికించే ప్రయత్నం చేసినా కానీ మహేష్‌ తాను తక్కువ కాదని నిరూపించుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిన్నప్పుడు తనకు వీణ వాయించడం ఇష్టమనీ, కానీ ఇప్పుడు టైమ్ లేదనీ , తనకు క్రికెట్‌ అంటే ఇష్టమనీ , చిన్నప్పుడు బాగా ఆడేవాడిననీ , ఇప్పుడు ఆడటం కుదరడం లేదని మహేష్ చెప్పారు. మహాభారతం`లో ఏ పాత్ర అంటే మీకిష్టమని, ఏ పాత్రని చేయాలనుకుంటున్నారని మహేష్‌ని ఎన్టీఆర్‌ ప్రశ్నించగా అందులో అన్ని ముఖ్యమైన పాత్రలే అని, ఇప్పుడు దాన్ని తీయడం మామూలు విషయం కాదని తన సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. అయితే మీకు కృష్ణుడి వేషం బాగా సూట్‌ అవుతుందని ఎన్టీఆర్‌ అన్నారు. ఇద్దరి మధ్య పిల్లలు, కూతురికి సంబంధించిన చర్చలో ఫాదర్‌ అనేదే ఒక అద్భుతమైన ఫీలింగ్‌ అని మహేష్ చెప్పారు. కూతురు లేని లోటు తనకు కనిపిస్తుందని ఎన్టీఆర్‌ తన మనసులోని ఫీలింగ్‌ని బయటపెట్టారు. సాంగ్స్ గురించి మహేష్ , తనకు ఓల్డ్ పాటలన్నీ ఇష్టమనీ , తాను నటించిన చిత్రంలో `ఒక్కడు` సినిమాలోని పాటలంటే ఇష్టమనీ తెలిపారు. అయితే త్వరలో రాజమౌళితో సినిమా చేస్తున్నారుగా ఇక అన్ని ఆటలు ఆడిపిస్తారనీ , అన్ని ఆటలు సెట్‌లో చూపిస్తారని, ఆయన మామూలోడు కాదని ఎన్టీఆర్ స్వీట్‌గా హెచ్చరిస్తూ ,అదొక అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ అని ఎన్టీఆర్ అన్నారు.

హాలీడేస్‌ విషయానికి వచ్చినప్పుడు ఏడాదికి మూడు సార్లు హాలీడేస్‌ ప్లాన్‌ చేస్తానని, సమ్మర్‌, దసరా, క్రిస్మస్‌ హాలీడేస్‌ సమయంలో విదేశాలకు వెళతామని మహేష్ చెప్పారు. “సర్కారు వారి పాట” గురించి చెబుతూ, పూరీ జగన్నాథ్‌ స్టయిల్‌లో ఈ సినిమా ఉంటుందనీ , “పోకిరి” ఫ్లేవర్ లో ఉంటుందనీ , ఫస్ట్ టైమ్‌ చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రని పోషిస్తున్నట్టు మహేష్ చెప్పారు. మల్టీస్టారర్‌ సినిమాల గురించి మహేష్ మాట్లాడుతూ ..ఇప్పుడున్న హీరోల మధ్య మంచి బాండింగ్‌ ఉందనీ , అంతా ఫ్రెండ్స్ గా ఉంటారనీ , ఆరోగ్యకరమైన వాతావరణం ఉందనీ , భవిష్యత్‌లో తెలుగు ఆడియెన్స్ మరిన్ని మంచి సినిమాలు చూడబోతున్నారనీ , పరోక్షంగా మల్టీస్టారర్‌ సినిమాలు చాలా వస్తాయని మహేష్ చెప్పారు. పలు ఆసక్తికర అంశాలతో మహేష్ బాబు ,ఎన్టీఆర్ ప్రేక్షకులను అలరించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.