కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గుడ్ లక్ సఖి. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నో సార్లు వాయిదా వేసిన అనంతరం ఇటీవలే ఈసినిమాను డిసెంబర్ 10 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ మరోసారి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. దానికి తోడు అఖండ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తున్నాం. అఖండ ప్రభంజనం మరో వారం రోజులపాటు ఉండేలా ఉంది. ఇక ముందు ముందు వచ్చేవి అన్నీ దాదాపు పెద్ద సినిమాలే ఉన్నాయి. దీంతో చిత్రయూనిట్ కూడా ఆలోచించినట్టుంది. అందుకే రిస్క్ తీసుకోకుండా రిలీజ్ ను వాయిదా వేసుకున్నారు. గుడ్ లక్ సఖి సినిమాను డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలిపారు. దీంతో ఈ ఏడాది చివరిగా వస్తున్న సినిమా ఇదే అవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
We are working hard to get this movie to you at the earliest but due to some unforeseen issues, we had to push the release of #goodlucksakhi to December 31 st . Hoping for you’re support and blessings 🙏🏽
— shravya varma (@shravyavarma) December 5, 2021
కాగా నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ఆదిపినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమాప్రభ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రూపొందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: