పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ షూటింగ్ స్పెయిన్‌లోని బర్సిలోనాలో జరుగుతోంది. మహేష్, కీర్తి సురేష్ పై సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా రోజులైంది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా నుండి థమన్ తన ట్విట్టర్ ద్వారా ఇచ్చిన అప్ డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ ట్రాక్ మీ స్పీకర్లను బద్దలుకొట్టడం ఖాయం అంటూ తన ట్విట్టర్ ద్వారా ఒక ట్యూన్ ను కూడా పోస్ట్ చేశాడు. మరి నిజంగానే ఆ ట్యూన్ వింటుంటే ఖచ్చితంగా ఆకట్టుకునేలానే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
This Track goona c-r-a-c-k ur speakers UP !! For good 😊 🎵🎶 #SarkaruVaariPaata 🔥💥every time I hear it speakers fear it 🎵 pic.twitter.com/TpKN5Plxum
— thaman S (@MusicThaman) October 20, 2021
కాగా బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ రూపొందిస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాను సంక్రాంతి పండుగ కానుకగా వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు.
ఇక థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య కాలంలో ఆయన అందించిన పాటలు ఏ రేంజ్ లో పాపులర్ అయ్యాయో చూస్తూనే ఉన్నాం. మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి. అందుకే అందరూ థమన్ నే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చిన్న సినిమా నుంచి పాన్ ఇండియన్ సినిమాల వరకూ అందరి చాయిస్ థమన్ అయిపోయాడు. అలాగే థమన్ కూడా తనకు వచ్చిన అవకాశాలను అలానే సద్వినియోగం చేసుకుంటున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























