ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అటు తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఇప్పటికే అక్కడ ప్రాజెక్టులు కూడా చేస్తున్నారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక ఇక్కడ మరో యంగ్ హీరో కూడా బాలీవుడ్ ఎంట్రీ పై మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని వారసుడు అఖిల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా వచ్చిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఇక ఈసినిమా దసరా పండుగ రోజున రిలీజ్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఈసినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకొని ఎన్నోరోజుల నుండి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో అఖిల్ ను బాలీవుడ్ ఎంట్రీ గురించి అడుగగా.. ప్రస్తుతం తను బాలీవుడ్ కానీ హాలీవుడ్ సినిమాల గురించి కానీ ఆలోచించట్లేదని… టాలీవుడ్ అంటే తనకు చాలా ఇష్టమని.. తెలుగులోనే సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చాడు.
ఇక ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























