హనుమాన్ అంశ్ తెలుగు ట్రైలర్ రిలీజ్

Hanuman Ansh Telugu Trailer Released

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా, భక్తులు ప్రేమగా మహారాజ్-జీ అని పిలుచుకునే ఆయన జీవితం, బోధనల స్ఫూర్తితో రూపొందిన హనుమాన్ అంశ్ చిత్రం.. ఈ ఏడాదిలో అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. విశ్వాసం, భక్తి, ఆధ్యాత్మిక పరివర్తన వంటి అంశాలు అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డాక్టర్ విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వంలో ‘హనుమాన్ అంశ్’ తెరకెక్కింది. నీమ్ కరోలి బాబా పాత్రలో శోబినావ్ సత్యా నటించారు. చందన్ ఆనంద్, పూర్ణిమా తివారీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. శ్రేయాస్ ధర్మాధికారి సంగీతాన్ని అందించగా, రిషి పాఠక్ కూడా సంగీత దర్శకుడిగా క్రెడిట్ పొందారు. ఆధ్యాత్మికతతో నిండిన కథకు సంగీతం మరింత బలాన్ని చేకూర్చింది.

హిందీలో విజయవంతమైన థియేట్రికల్ జర్నీ అనంతరం ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హోంబలే ఫిల్మ్స్ తమ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ విభాగం ద్వారా గతంలో ‘హనుమాన్ అంశ్’ను అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేసింది. ఇప్పుడు సౌత్ ఇండియన్ భాషల థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుని.. ఈ చిత్రాన్ని దక్షిణాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

అక్టోబర్ 9న ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ థియేటర్లలో విడుదల కానుంది. అలాగే తమిళం, కన్నడ, మలయాళం మార్కెట్లలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. భారతీయ కథలను వివిధ భాషలు, ప్రాంతాల్లోని ప్రేక్షకులకు చేరువ చేయడంలో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్.. ‘హనుమాన్ అంశ్’ థియేట్రికల్ జర్నీని దక్షిణాదిలో మరింత విస్తరిస్తోంది. 

తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. నీమ్ కరోలి బాబా జీవితంలోని ప్రధాన ఘట్టాలని ఆవిష్కరించిన ఈ ట్రైలర్ ఆద్యంతం అద్భుతంగా సాగింది. 

‘హనుమాన్ అంశ్’లోని కథ భాషకు అతీతమైనది. నీమ్ కరోలి బాబా బోధనలు, తత్వం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అనుసరించారు. ఆ విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక అనుబంధాన్ని ఒక సన్నిహితమైన సినిమాటిక్ జర్నీగా ఈ చిత్రం ఆవిష్కరించే ప్రయత్నం చేసింది.

హిందీలో ఇప్పటికే ప్రేక్షకులపై బలమైన ప్రభావాన్ని చూపిన ‘హనుమాన్ అంశ్’.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. మహారాజ్-జీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత మందికి చేరువ చేయాలనే లక్ష్యంతో అక్టోబర్ 9న తెలుగు థియేటర్లలోకి వస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.