థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించిన తమిళ చిత్రం ‘మండాడి’ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. తమిళ వర్సటైల్ యాక్టర్ సూరి, టాలీవుడ్ యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఆసక్తికరమైన చిత్రం ఓటీటీ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం అక్టోబర్ 8 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఒకేసారి పాన్-ఇండియా రేంజ్లో స్ట్రీమింగ్ కానుంది.
సముద్రం నేపధ్యంలో సాగే ఓ ఉత్కంఠభరితమైన గేమ్ చుట్టూ విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని మది మారన్ తెరకెక్కించారు. సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 150కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.తెలుగులో ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా విజయాన్ని అందుకుంది.
ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. మరి ఓటీటీ వేదికగా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























