పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “, మలయాళ సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా కాలేజీ నేపథ్యంలో కమర్షియల్ ఎంటర్ టైనర్ “PSPK 28 ” మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో కాలేజీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కాలేజీ సెట్ ను రూపొందించారు. బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ “మూవీ లో లాయర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ “PSPK 28 ” మూవీ లో లెక్చరర్ గా ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: