“ఫైటర్ “మూవీ అప్ డేట్

సెలబ్రిటీ న్యూస్ Actress Ananya Panday, Fighter Film, Fighter Movie Releases An Interesting Update, Fighter Movie Team Releases An Interesting Update, Fighter Team Releases An Interesting Update, Hero Vijay Deverakonda About Fighter, Latest Telugu Movies News, Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood, Tollywood Movie Updates, Vijay Deverakonda Next Project News On Cards, Vijay Deverakonda Talking About Fighter Movie

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ “మూవీ తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ముంబై లో 40 రోజుల షూటింగ్ షెడ్యూల్ జరుపుకున్న “ఫైటర్ “మూవీ మరో షెడ్యూల్
ముంబై లో జరుపుకోవాల్సి ఉంది. కరోనా కారణంగా మూవీ షూటింగ్స్ నిలిచిపోయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే పలు మూవీ షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యాయి . కొవిడ్ -19 కారణంగా విదేశీ ఫైటర్స్ దొరకపోవడం తో “ఫైటర్ “మూవీ షూటింగ్ ఆలస్యమయింది. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ కావడంతో జనవరి నెలలో “ఫైటర్ “మూవీ షూటింగ్ జరపడానికి దర్శకుడు ప్లాన్ చేశారు. హీరో విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. ఒక ప్రత్యేకమైన బాక్సింగ్ సెట్ లో కొన్ని ఫైట్ సీన్స్ ను
పూరి జగన్నాథ్ తెరకెక్కించనున్నారు. సంక్రాంతికి “ఫైటర్ “మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్”మూవీ తరువాత పూరి దర్శకత్వంలో రూపొందుతున్న “ఫైటర్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.