సక్సెస్ ఫుల్”అందాల రాక్షసి “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి “దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, సోగ్గాడే చిన్ని నాయనా “, అర్జున్ సురవరం “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.సందీప్ కిషన్ హీరో గా హాకీ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “A1 ఎక్స్ ప్రెస్ “మూవీ షూటింగ్ ను లావణ్య కంప్లీట్ చేశారు. ఈ మూవీ లో తన పాత్రకై లావణ్య హాకీ లో ప్రత్యేక శిక్షణ పొందారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



అల్లు అరవింద్ సమర్పణ లో గా GA 2 పిక్చర్స్ బ్యానర్ పై కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా మాస్ ఎంటర్ టైనర్ “చావు కబురు చల్లగా “మూవీ రూపొందుతుంది. హీరో కార్తికేయ బస్తీ బాలరాజు గా ఒక మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ మూవీ లో లావణ్య కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా లావణ్య ఇన్ స్టాగ్రామ్ 2 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను చేరుకున్నారు. ఈ సందర్భంగా లావణ్య తనపై ప్రేమ , అభిమానాలు చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























