మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, మైత్రీ మూవీ మేకర్స్ మరియు టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త చిత్రం ‘ఇరుముడి’.నిన్నుకోరి , ‘మజిలీ’, వంటి విభిన్న చిత్రాలను అందించిన బ్లాక్బస్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వర్షాకాలంలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తూ తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది.ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించింది.ఈ వీడియోలో రవితేజ , బేబీ నక్షత్ర డబ్బింగ్ చెప్తూ కనిపించారు.
ఈసినిమాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా, సీనియర్ నటుడు సాయికుమార్ మరియు బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి, ఈ చిత్రాన్ని ఆగస్టు 21, 2026 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ ఊహించిన రీతిలో రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే రెండో పాటను విడుదల చేయనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























