కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

కొరియన్ కనకరాజు నుండి మాస్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్ రాసా గుమ్మాడి రిలీజ్

RassaGummadi Song from Korean Kanakaraju Released
సాంగ్1 ని. చదువు

కొరియన్ కనకరాజు నుండి మాస్ అండ్ ఎనర్జిటిక్ సాంగ్ రాసా గుమ్మాడి రిలీజ్

RassaGummadi Song from Korean Kanakaraju Released

RassaGummadi Song from Korean Kanakaraju Released

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ‘రాసా గుమ్మాడి’ లిరికల్ సాంగ్ విడుదలవుతూ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ఆదివారం సాయంత్రం ఏపీలోని అనంతపురం వి మెగా థియేటర్‌లో అభిమానుల కోలాహలం మధ్య ఈ మాస్ సాంగ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ ఈ పాటకు అదిరిపోయే ఫోక్ అండ్ మాస్ ట్యూన్ అందించగా.. స్టార్ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ పవర్‌ఫుల్ సాహిత్యం అందించారు. జానపద గాయకుడు నల్గొండ గద్దర్ తన ఎనర్జిటిక్ వాయిస్‌తో పాటకు కొత్త ప్రాణం పోశారు.

రాయలసీమ జాతర బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాటలో వరుణ్ తేజ్ ఊరమాస్ స్టెప్పులతో రచ్చ చేశారు. "మా పెదనాన్న చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకునే ఈ పాటకు డ్యాన్స్ చేశాను" అని వరుణ్ తేజ్ ప్రత్యేకంగా చెప్పారు. ఈ పాటలో బ్యూటీ దక్షా నాగర్కర్ స్పెషల్ అప్పీరెన్స్‌తో మెరిసిపోగా, వరుణ్-దక్షా జోడీ కెమిస్ట్రీ, విజువల్స్ పక్కా ఫెస్టివ్ వైబ్‌ను తీసుకొచ్చాయి.

రితికా నాయక్ హీరోయిన్‌గా, హాస్య నటుడు సత్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్