కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

కార్తి సర్దార్ 2 నుండి ఎస్.జే. సూర్య స్టైలిష్ ఫస్ట్ లుక్ రిలీజ్

S.J. Suryah’s Stylish First Look from Sardar 2 Unveiled
ఫస్ట్ లుక్1 ని. చదువు

కార్తి సర్దార్ 2 నుండి ఎస్.జే. సూర్య స్టైలిష్ ఫస్ట్ లుక్ రిలీజ్

S.J. Suryah’s Stylish First Look from Sardar 2 Unveiled

S.J. Suryah’s Stylish First Look from Sardar 2 Unveiled

హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’కి సీక్వెల్ ‘సర్దార్ 2’తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్2 కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ గ్రాండ్ గా నిర్మిస్తోంది.

ఈ చిత్రంలో ఎస్.జే. సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

నీలం రంగు సూట్‌లో స్టైలిష్ లుక్‌తో మెట్లపై నిలబడి కనిపించిన ఎస్.జే. సూర్య పోస్టర్‌లో ఎంతో క్లాసీగా, మిస్టీరియస్‌గా కనిపిస్తున్నారు. బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న భారీ డ్రాగన్ ఆర్ట్‌వర్క్, డార్క్ టోన్, షేడ్స్‌తో కూడిన ఆయన లుక్ పాత్రపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ పోస్టర్‌ను బట్టి 'సర్దార్ 2' లో ఎస్.జే. సూర్య పాత్ర కథలో అత్యంత కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు.

సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో హ్యుజ్ స్కేల్ లోతెరకెక్కతోంది. ఈ సినిమాకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్. రాజీవ్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనర్. విజయ్ వేలుకుట్టి ఎడిటర్. AP పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్.ఈ చిత్రం సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్