చెన్నై లవ్ స్టోరీకి మెగా సపోర్ట్.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్

Megastar Chiranjeevi Confirmed as Chief Guest for the Pre-Release Event

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’. ‘బేబీ’ వంటి సంచలన చిత్రాన్ని అందించిన ఎస్‌కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రవి నంబూరి దర్శకత్వం వహించారు. జులై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నుంచి అద్భుతమైన మద్దతు లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. చిన్న సినిమాలను, యంగ్ టాలెంట్‌ను ఎల్లప్పుడూ ప్రోత్సహించే చిరంజీవి..’చెన్నై లవ్ స్టోరీ’ చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ ఈ వేడుకకు రాబోతుండటంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.

ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని ‘U/A’ సర్టిఫికెట్‌తో సిద్ధమైన ఈ చిత్రానికి, మెగాస్టార్ రాకతో ప్రమోషన్స్ సరికొత్త ఊపును సంతరించుకున్నాయి. మెగా సాయం మరియు బ్లెస్సింగ్స్ తో ‘చెన్నై లవ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయమని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.