త్వరలో ‘కె.జి.యఫ్ 2’ అప్ డేట్ ఇస్తా అంటున్న డైరెక్టర్..!

Director Prashanth Neel To Give An Update About KGF 2 Movie Soon

కె.జి.యఫ్ సీక్వెల్ కె.జి.యఫ్2 కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఈ కరోనా వచ్చి నిరాశనే మిగిల్చింది. అసలే ఇక ఈ సినిమా రిలీజ్ ఎలాగూ లేట్ అవుతుండటంతో కనీసం ఏదైనా అప్ డేట్ ఇస్తారేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్‌డేట్ కూడా బయటకు రాలేదు. ఇక వారికి కాస్త ఊరట కలిగించే న్యూస్ ఒకటి చెప్పాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈరోజు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు కావడంతో.. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘కె.జి.యఫ్ 2’ గురించి అడుగగా. `త్వరలోనే `కేజీఎఫ్-2` అప్‌డేట్ వస్తుంద`ని చెప్పాడు. దీనితో ఈనెల 29 న సంజయ్ దత్ పుట్టినరోజు కావడంతో ఆరోజు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తారేమో అని అనుకుంటున్నారు. మరి చూద్దాం ఎప్పుడు ఇస్తారో..!

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

ఇక ఈ సినిమాలో కూడా యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని.. ఆడియన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని ఇప్పటికే చెప్పారు. ఇంకా కొద్దిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక తొందరలోనే షూట్ కూడా పూర్తి చేసి.. సినిమాను కూడా తొందరలోనే రిలీజ్ చేద్దామనుకుంటున్నారు.

కాగా ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవీనాటాండన్ ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో నటిస్తుంది. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.