రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి1. బాహుబలి2 సిరీస్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన తెలుగు సినిమా రేంజ్ ను భారీ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించడమే కాకుండా.. ఇండియన్ హిస్టరీలోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. తెలుగు సినీ చరిత్రలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మొదటి సినిమా. అంతేకాదు ఇప్పుడు అంత దైర్యంగా.. అసలు ఏ మాత్రం వెనుకాడకుండా భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నారంటే.. దానికి ఓ రకంగా బాహుబలి సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషనే కారణమని చెప్పొచ్చు. కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాదు.. పక్క రాష్ట్రాలు.. దేశాల్లో ఉన్న ప్రేక్షుకులను సైతం అలరించి హద్దుల్ని బద్దలు కొట్టేసింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 148 ఏళ్ల ఆల్బర్ట్ హాల్ చరిత్రలో ఇంగ్లీష్ భాషలో కాకుండా ఇతర భాషలో ఓ సినిమా ప్రదర్శితం కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈసినిమాకు వచ్చిన అవార్డుల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అవార్డులను దక్కించుకుంది.. ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా 7 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. అసలు సంగతేంటంటే.. బాహుబలి సినిమా షూటింగ్ 2013 జూలై 6 ప్రారంభమైంది. షూట్ కర్నూలులోని ప్రసిద్ధ రాక్ గార్డెన్స్ వద్ద ప్రారంభమైంది. వేలాది మంది అభిమానుల మధ్య ఆ రోజు షూటింగ్ ను ప్రారంభించారు. ఇక నేటితో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ విషయం తెలుపుతూ బాహుబలి మొదలైన రోజు నాటి ఫొటోలను ‘బాహుబలి’ టీమ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 7 సంవత్సరాల క్రితం ఇదే రోజు మేము బాహుబలి చిత్ర షూటింగ్‌ని మొదలెట్టాము..’’ అని ఆ నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది చిత్ర యూనిట్.
7 years ago on this day, #Baahubali shoot has started and rest is the history 🔥🔥#Prabhas @RanaDaggubati @ssrajamouli #AnushkaShetty @tamannaahspeaks @meramyakrishnan @mmkeeravaani @BaahubaliMovie pic.twitter.com/3my7iilGOw
— Telugu FilmNagar (@telugufilmnagar) July 6, 2020
విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన అనుష్క, తమన్నా కథానాయికలుగా నటించగా రమ్యకృష్ణ, దగ్గుబాటి రానా, నాజర్, సత్యరాజ్, అడివి శేష్, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























