జోగినిపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమాన్ని ఎప్పుడో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రంలో ఎంతో మంది పాల్గొని మొక్కలు నాటగా తాజాగా ప్రభాస్ కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరించాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రభాస్ తనవంతుగా తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. అనంతరం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, రానా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ను ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు నామినేట్ చేస్తున్నాను అని తెలిపారు. అంతేకాదు ఈ సందర్భంగా ప్రభాస్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొక్కలు నాటిన తర్వాత ప్రభాస్ మాట్లాడుతూ… ప్రకృతి బావుండాలని సంతోష్ కుమార్‌గారు ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమం ఎంతో గొప్పది.. . ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా వారు దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్యక్రమం నన్ను ఎంతో ఇన్‌స్పైర్ చేసింది. అందుకే వారి స్ఫూర్తితో వారు ఎక్కడ సూచిస్తే అక్కడ.. వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. ఆయన ఆశయం ముందుకు పోవాలంటే.. మనమంతా ఒకటై పనిచేయాల్సిన అవసరం ఉంది.. నా అభిమానులందరూ కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని కోరుకుంటున్నానన్నారు.
మరి ఇప్పటివరకూ అందరూ గ్రామాలను దత్తత తీసుకుంటుంటే.. ప్రభాస్ మాత్రం ఫారెస్ట్ ను దత్తత తీసుకొని మరోసారి బాహుబలి అనిపించుకున్నాడు.




ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు యూరప్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా… కరోనా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. కాగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి ‘ ఓ డియర్’ .. ‘రాధే శ్యామ్’ టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. దీనిపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది.
ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























