రాకింగ్ స్టార్ యష్ నుండి నెక్స్ట్ వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘టాక్సిక్’ . గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో డ్రగ్ మాఫియా నేపథ్యంలో హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ సరికొత్త మ్యూజికల్ అప్‌డేట్‌ను విడుదల చేశారు. చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘తబాహి’ ఫుల్ వీడియో సాంగ్‌ను అఫీషియల్‌గా రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూర్తి స్థాయి రొమాంటిక్ మోడ్ లో సాగే ఈ పాటలో యష్, కియారా అద్వానీల మధ్య కెమిస్ట్రీ నెవర్ బిఫోర్ అనేలా ఉంది. స్క్రీన్‌పై వీరిద్దరి జంట ఎంతో స్టైలిష్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ లవ్ అండ్ ప్యాషన్ ఓరియెంటెడ్ సాంగ్‌ను ప్రముఖ సింగర్ కమ్ కంపోజర్ విశాల్ మిశ్రా తనదైన స్టైల్లో ఆలపించగా, స్టార్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ , మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పవర్‌ఫుల్ మ్యూజికల్ ట్రీట్‌తో సినిమాపై హైప్ మరింత పెరిగింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ యాక్షన్ ఎపిక్ ప్రపంచవ్యాప్తంగా 2026, ఆగస్టు 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























