అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ రా అండ్ రస్టిక్ విలేజ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘U/A’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమా ఫైనల్ రన్‌టైమ్‌ను 158 నిమిషాలుగా (2 గంటల 38 నిమిషాలు) లాక్ చేశారు. సెన్సార్ బోర్డు సూచనల మేరకు చిత్రంలోని కొన్ని వైలెంట్ విజువల్స్ మరియు బ్లడ్‌షెడ్ సీన్స్‌కు సంబంధించి దాదాపు 32 సెకన్ల మేర ట్రిమ్మింగ్స్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యుల నుంచి అవుట్‌పుట్ పట్ల చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు సెకండాఫ్ ఎమోషనల్ యాక్షన్ బ్లాక్స్‌లో అఖిల్ వన్-మెన్ షోగా అదరగొట్టాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కథలో వచ్చే ఒక షాకింగ్ ట్విస్ట్ సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవనుందని టాక్.
సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. శివాజీ, బ్రహ్మాజీ, సునీల్, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పవర్ఫుల్ వాయిస్ ఓవర్ అందించడం సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లింది. మరికొద్ది గంటల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖిల్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























