భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, కళ్లు చెదిరే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మైథలాజికల్ విజువల్ వండర్ ‘రామాయణ’. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో మూడు భాగాలుగా రూపొందుతున్న ఈ లార్జర్-ద్యాన్-లైఫ్ ప్రాజెక్ట్ నుంచి ప్రేక్షకులకు మరియు సినిమా ప్రేమికులకు ఒక బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు.ఈనెల 18న ఢిల్లీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది.ఇందులో ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ట్రైలర్‌ను హాలీవుడ్ రేంజ్ విజువల్స్ మరియు మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కట్ చేసినట్లు తెలుస్తోంది. భారతీయ పురాణ ఇతిహాసాన్ని వెండితెరపై ఎన్నడూ చూడని రీతిలో ఆవిష్కరించేందుకు వీఎఫ్ఎక్స్ విభాగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ అద్భుతమైన విజువల్ ట్రీట్ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ‘శ్రీరాముడి’ పాత్రలో నటిస్తుండగా సాయి పల్లవి ‘సీతాదేవి’గా కనిపిస్తోంది. రాకింగ్ స్టార్ యష్ ‘రావణాసురుడి’గా పవర్ఫుల్ నెగెటివ్ రోల్లో నటిస్తూ ఈ చిత్రానికి సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ పాన్-ఇండియా విజువల్ ఎపిక్ దీపావళికి థియేటర్లలోకి రానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























