పెద్ది అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది

Peddi Official OTT Release Date Announced

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పెద్ది’ డిజిటల్ లవర్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ఖరారు చేసింది. జులై 9వ తేదీ నుండి ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు. హిందీ వెర్షన్ మాత్రం కొద్దిరోజుల తర్వాత అందుబాటులోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, కన్నడ సెన్సేషన్ శివరాజ్‌కుమార్, లెజెండరీ నటుడు బొమన్ ఇరానీ, జగపతి బాబు మరియు దివ్యేందు కీలక పాత్రల్లో మెరిశారు.వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈసినిమా గత నెల 4న విడుదలై 400కోట్ల వసూళ్లతో సూపర్ హిట్ అనిపించుకుంది. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.