కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఇంట్రెస్టింగ్ గా వదలా ట్రైలర్

Vadala Impresses with an Engaging Trailer

ఇంట్రెస్టింగ్ గా వదలా ట్రైలర్

Vadala Impresses with an Engaging Trailer

Vadala Impresses with an Engaging Trailer

వెర్సటైల్ యాక్టర్ జగపతి బాబు, సీనియర్ నటి లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ 'వదలా'. అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో సస్పెన్స్, మిస్టరీ మరియు బలమైన ముక్కోణపు ప్రేమకథా ఎమోషన్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకునే ఒక పర్ఫెక్ట్ దంపతుల జీవితంలోకి అనుకోకుండా ఒక యువతి (హృతిక శ్రీనివాస్) ప్రవేశిస్తుంది. మొదట్లో అమాయకపు ఆరాధనగా ప్రారంభమైన ఆమె బంధం, మెల్లగా భర్తపై విపరీతమైన వ్యామోహంగా మారుతుంది. ఈ క్రమంలో ఆ దంపతుల జీవితం ఎలాంటి ఒడిదొడుకులకు లోనైంది, ప్రేమ-భయం మరియు మానసిక సంఘర్షణల మధ్య కథ ఎలాంటి మలుపులు తిరిగిందనే ఆసక్తికరమైన అంశాలతో ట్రైలర్‌ను అత్యంత ఉత్కంఠభరితంగా కట్ చేశారు. ఈ ట్రైలర్ ఆడియన్స్‌లో గట్టి క్యూరియాసిటీని పెంచుతోంది.

చరిత చిత్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విజువల్స్ అందించగా, కార్తీక్ కొడకండ్ల సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలో నటిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్