రోజు రోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. ఇక ఈ చర్యల్లో భాగంగా ఇప్పటీకే ఎంతో మంది ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలు అందించారు.. ఇంకా అందిస్తూనే వున్నారు. ఇక సెలబ్రిటీస్ నుండి సామాన్య ప్రజలు వరకూ అందరూ ఇంట్లోనే ఉండాలని… కరోనా వైరస్ ను తరిమికొట్టాలని కోరుతున్నారు. దీనిలో భాగంగానే కరోనా పై అవగాహన కల్పించేందుకు ఇప్పటినే ఎంతోమంది పలు వీడియోలతో ముందుకొచ్చారు. ఇప్పుడు తాజాగా విలక్షణ నటుడు కమల్ కూడా ప్రజల్లో కారోనాపై అవగాహన కల్పించేందుకు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఒక పాట పాడి విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘అరివుమ్ అన్బుమ్’ (బుద్ధి, ప్రేమ) పేరుతో ఈ పాట విడుదలైంది. ఈ పాటకి జిబ్రాన్ సంగీతం అందించగా… కమల్‌తో 12 మంది ప్రముఖులు తమ గొంతు కలిపారు. ఇందులో శంకర్ మహదేవన్, అనిరుధ్, జిబ్రాన్, యువన్ శంకర్ రాజా, దేవిశ్రీ ప్రసాద్, బొంబాయి జయశ్రీ, సిద్ శ్రీరామ్, సిద్ధార్థ్, శ్రుతీ హాసన్, ఆండ్రియా, తమిళ బిగ్ బాస్ ఫేమ్ ముగెన్ తదితరులు ఉన్నారు.ఈ సాంగ్‌ని పాడిన వారందరు ఎవరి ఇళ్ళల్లో వారు ఉండి రికార్డ్ చేశారు. పాటలో పోలీసులు, వైద్యులు,పారిశుద్ధ్య కార్మికుల త్యాగాలని చూపిస్తూ వలస కార్మికులు పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పారు. కిలో మీటర్ల దూరం పిల్లలతో కలిసి నడిచి వెళుతున్న బాధని పాటలో వ్యక్తం చేశారు. ఈ పాటకు ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది.
Launching-Arivum Anbum https://t.co/9NEMTc5R57@RKFI @GhibranOfficial @anirudhofficial @Bombay_Jayashri @thisisysr #Siddharth @sidsriram @Shankar_Live @shrutihaasan @ThisIsDSP @themugenrao @andrea_jeremiah @lydian_official @thinkmusicindia #MaheshNarayanan #ArivumAnbum
— Kamal Haasan (@ikamalhaasan) April 23, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























