ఇటీవల తూటా అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ మళ్ళీ మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఆర్. ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో `పట్టాస్` పేరుతో ఓ మాస్ ఎంటర్ టైనర్ తెరకెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా జనవరి 16న రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీటితో పాటు మరో కొన్ని సినిమాలను వెంటనే లైన్ లో పెట్టేసాడు ధనుష్. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో డీ 40 పేరుతో ఓ చిత్రం చేస్తున్నాడు ధనుష్. ఇప్పుడు మరో సినిమాను సెల్వరాజ్ డైరెక్షన్లో చేస్తున్నాడు. ఈ చిత్రానికి కర్ణన్ అనే పేరు పెట్టారు. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాలీవుడ్ నటి రజిష విజయన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మొత్తానికి సినిమాల జయాపజయాలతో పనిలేకుండా ధనుష్ వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: