రామాయణను తెలుగులో విడుదల చేయనున్న ఎస్‌విసి

SVC to Release Ramayana in Telugu States

భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ మైథలాజికల్ వండర్‌గా రూపుదిద్దుకుంటున్న ప్యాన్-ఇండియా చిత్రం ‘రామాయణ’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) దక్కించుకుంది. దిల్ రాజు నేతృత్వంలోని ఎస్‌విసి సంస్థ ఈ ఎపిక్ సినిమాను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గకుండా విజువల్స్, అద్భుతమైన సాంకేతిక విలువలతో వస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మైలురాయి లాంటి సినిమాకి మరింత హంగామా జోడిస్తూ, ఈరోజే హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్‌లో ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు చిత్ర కథానాయకుడు రణ్‌బీర్ కపూర్, సీతగా నటిస్తున్న సాయి పల్లవి, రావణాసురుడిగా నటిస్తున్న రాకింగ్ స్టార్ యష్‌తో పాటు దర్శకుడు నితేష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా, దిల్ రాజు మరియు టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యష్, లక్ష్మణుడిగా రవి దూబే మరియు హనుమంతుడిగా సన్నీ డియోల్ అలరించనున్నారు. నమిత్ మల్హోత్రా (ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు ఎ.ఆర్. రెహమాన్ మరియు హ్యాన్స్ జిమ్మర్ కలిసి సంగీతాన్ని అందించడం మరొక పెద్ద విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ దృశ్య కావ్యం దీపావళి కానుకగా 2026 నవంబర్ 5న భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.