ఇట్లు అర్జునను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది – నాగార్జున

Nagarjuna Says He Is Proud to Present Itllu Arjuna

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, డెబ్యూ దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. తమన్ ఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, ఇతర ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బిగ్ రివిల్ చేశారు. కింగ్ నాగార్జున సమర్పణలో ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు గ్రాండ్ గా రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రెస్ మీట్‌లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కొత్త టాలెంట్ అంటే నాకు చాలా ఇష్టం. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా వై.వి.ఎస్. చౌదరితో ఒక సినిమా నిర్మించాను. దాంతో కొత్తవాళ్లతో సినిమాలు తీసే జర్నీ మొదలైంది. రాజ్ తరుణ్ ‘ఉయ్యాల జంపాల’ సినిమా సమయంలో అప్పటికి టీజర్లు, ట్రైలర్లు ఏమీ లేవు. సినిమా చూడమన్నారు. చూశాను. నాకు చాలా నచ్చింది. దాంతో ఆ సినిమాలో నేను భాగస్వామి అయ్యాను. ఆ సినిమా చాలా మంచి విజయం సాధించింది. ‘ఇట్లు అర్జున’ సినిమాకి మహేష్, అనీష్, వెంకీ వచ్చి గ్లింప్స్‌కు వాయిస్ ఓవర్ చెప్పమన్నారు. నాకు నచ్చడంతో వాయిస్ ఓవర్ చెప్పాను.

నాకు అనీష్‌తో పరిచయం ఉంది. తన తొలి సినిమాకే మూగవాడి క్యారెక్టర్ చేయడం నిజంగా చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ కథ గురించి అడిగాను. కథ చెప్పారు. అప్పటికీ తొలి సినిమాకి ఎందుకు ఇంత పెద్ద ఛాలెంజ్ అని అడిగాను. వాళ్లు కథ మీద నమ్మకంతో సినిమాను అద్భుతంగా పూర్తి చేశారు. సినిమా మొత్తం చూశాను. నాకు చాలా నచ్చింది. బ్రిలియంట్ స్క్రీన్‌ప్లే. అనీష్ పెర్ఫార్మెన్స్ చూసి సర్‌ప్రైజ్ అయ్యాను. చాలా అద్భుతంగా నటించాడు. అనీష్, అనస్వర కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా ఉంది. మంచి టాలెంటెడ్ టీమ్ చేసిన సినిమా ఇది. ఈ సినిమా చూసిన తర్వాతే డీఓపీ రాజాను నా ‘కింగ్ 100’ సినిమాకి పెట్టుకున్నాను. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికే పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సినిమా అంతా ట్విస్టులు, టర్న్స్‌తో నడుస్తూ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఉంటుంది. ఈ సినిమాను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా, హ్యాపీగా ఉంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.