ఆసక్తి రేపుతున్న కల్ట్ ట్రైలర్

Cult Trailer Sparks Curiosity

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ‘కల్ట్ ’ చిత్రంతో డార్క్ వరల్డ్ లోకి అడుగుపెడుతున్నారు. హీరోగా నటించడంతో పాటు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించి, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. తారక్ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ కాకరాల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని, వాస్తవ జీవితంలో చోటుచేసుకున్న భయానక ఘటనల స్ఫూర్తితో రూపొందించిన భారతదేశపు తొలి స్లాషర్ థ్రిల్లర్‌. సినిమా థియేట్రికల్ రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రమాదం, హింస, ఊహించని మలుపులతో నిండిన భయానక ప్రపంచాన్ని ఈ ట్రైలర్ పరిచయం చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోవాలోని ఒక నిర్మానుష్య ఐలాండ్ ఎస్టేట్‌లో 300 మందికి పైగా చిక్కుకుపోవడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ ప్రాంగణం చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉండటంతో పాటు, ఎంట్రీ గేట్ వద్ద ఆర్‌డీఎక్స్ పేలుడు పదార్థాలను అమర్చడంతో అక్కడి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది. ప్రాణాలతో బయటపడాలంటే ప్రాణాంతకమైన గేమ్స్‌లో పాల్గొనడం తప్ప మరో మార్గం ఉండదు. ప్రతి నిర్ణయం ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదం ఉన్న ఈ గేమ్స్‌లో ఎవరు నిలబడతారు? ఎవరు ప్రాణాలు కోల్పోతారు? అనే ఉత్కంఠ నెలకొంటుంది. ఈ భయానక పరిస్థితుల్లో చిక్కుకున్న వారిలో డీఎస్పీ సంకల్ప్ నాయక్ కూడా ఒకరు. పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతున్న కొద్దీ ఆయన తనదైన రీతిలో ఈ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.

టీజర్‌లో విశ్వక్‌సేన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని సూచించగా, ట్రైలర్ ఆయన పాత్రలో మరో కోణాన్ని ఆవిష్కరించింది. డ్రగ్స్ అంటే తీవ్రంగా వ్యతిరేకించే, నేరస్థులను తనదైన కఠినమైన పద్ధతిలో ఎదుర్కొనే బాడాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించారు. దూకుడు, యాటిట్యూడ్, హ్యుమర్ కలగలిసిన ఈ పాత్ర సినిమా డార్క్ బ్యాక్ డ్రాప్ కి ఆకర్షణను తీసుకొస్తుంది. విశ్వక్‌సేన్ తనదైన స్టైల్, తీవ్రతతో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు పోషించిన కీలక పాత్రలను కూడా ట్రైలర్‌లో పరిచయం చేశారు. ఈ పాత్రలన్నీ కలిసి ఉత్కంఠభరితమైన కథను ముందుకు నడిపిస్తున్నాయి.

రచయితగా, దర్శకుడిగా విశ్వక్‌సేన్ ఈ విభిన్నమైన కథాంశాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. థ్రిల్లింగ్ మూమెంట్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, హాస్యాన్ని మేళవిస్తూ కథనాన్ని రూపొందించారు. దీంతో ‘#CULT’ ట్రైలర్‌ సినిమాపై క్యురియాసిటీ పెంచింది.

తరుణ్ భాస్కర్ రాసిన డైలాగ్స్ సన్నివేశాలకు మరింత పదును తీసుకొచ్చాయి. అరవింద్ ములే రూపొందించిన ప్రొడక్షన్ డిజైన్ స్లాషర్ జానర్‌కు తగిన డేంజర్ వాతావరణాన్ని సృష్టించింది. సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథన్ తన ప్రత్యేకమైన విజువల్స్, ఉత్కంఠను పెంచే కెమెరా వర్క్‌తో ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లారు. రవి బస్రూర్ అందించిన ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్‌ను మరింత పెంచుతూ సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది. రవి తేజ గిరిజాల ఎడిటింగ్ . సాంకేతిక బృందం సినిమా మొత్తం ప్రభావవంతంగా రూపొందడంలో కీలక పాత్ర పోషించింది.

విభిన్నమైన కథాంశం, డేంజర్ నేపథ్యం, ఆసక్తికరమైన హీరో పాత్ర, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో ‘#CULT’ ట్రైలర్ ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసి, సినిమాపై అంచనాలను పెంచింది. ఈ చిత్రం అక్టోబర్ 30న తెలుగు, హిందీ, ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ భాషల్లో ఒకేసారి థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.