య‌న్టీఆర్ ‘త‌ల్లా? పెళ్ళామా?’ కి 50 ఏళ్ళు

NTR Talla Pellama Completes 50 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Talla Pellama Movie Updates,Talla Pellama Telugu Movie Latest News,Sr NTR Talla Pellama Movie Live Updates,50 Years For Sr NTR Talla Pellama Movie,Sr NTR Talla Pellama Telugu Movie Completed 50 Years

విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌమగా కీర్తిగాంచిన స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు క‌థానాయ‌కుడిగానే కాదు… ద‌ర్శ‌కుడిగానూ ప‌లు ఘ‌న‌విజ‌యాల‌ను చ‌విచూశారు. విభిన్న త‌ర‌హా క‌థాంశాల‌ను ఎంచుకుని.. అనేక సంచ‌ల‌నాలు సృష్టించారు. అలా.. య‌న్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తూనే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రాల్లో `త‌ల్లా? పెళ్ళామా?` ఒక‌టి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కిన ఈ సినిమాలో య‌న్టీఆర్ కి త‌ల్లిగా శాంత‌కుమారి న‌టించ‌గా, పెళ్ళాంగా చంద్ర‌క‌ళ ద‌ర్శ‌న‌మిచ్చింది. ఇక త‌న‌యుడిగా మాస్ట‌ర్ నంద‌మూరి హ‌రికృష్ణ న‌టించాడు. టీవీ రాజు స్వ‌ర‌సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ విశేష ఆద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా `తెలుగుజాతి మ‌న‌ది.. నిండుగా వెలుగు జాతి మ‌న‌ది` గీత‌మైతే ఒక ఆణిముత్య‌మ‌నే చెప్పాలి. ఇందులో సంద‌ర్భానుసారంగా య‌న్టీఆర్ ప‌లికే ప‌లుకులు అభిమానుల‌కు వీనుల విందు పంచాయి. అలాగే `బ్ర‌హ్మం తాత‌`, `నువ్వు న‌వ్వుతున్నావు` పాట‌లు కూడా భ‌లేగా అల‌రించాయి.

య‌న్టీఆర్ స్వ‌యంగా క‌థ‌, క‌థ‌నం అందించ‌డ‌మే కాకుండా నిర్మాణాన్ని కూడా చేప‌ట్టిన ఈ చిత్రం.. హిందీలో `బిడాయి`, త‌మిళంలో `పిరియ విడై` పేర్ల‌తో రీమేక్ అయింది. 1970 జ‌న‌వ‌రి 8న విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన `త‌ల్లా? పెళ్ళామా?` నేటితో 50 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =