దొంగనా కొడుకు టీజర్ విడుదల తేది ఖరారు

Donganaa Koduku Teaser Release Date Announced

మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో మౌళి తనూజ్ ప్రశాంత్ మరియు సుస్మితా శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రైమ్ కామెడీ చిత్రం ‘దొంగ నా కొడుకు’. ‘లిటిల్ హార్ట్స్’తో ఆకట్టుకున్న మౌళి ఈసారి ఒక వైవిధ్యమైన హీస్ట్ నేపధ్యంలో సాగే పూర్తిస్థాయి వినోదాత్మక కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నూతన దర్శకుడు శ్రీను కంబాల తెరకెక్కిస్తున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచే మంచి పాజిటివ్ వైబ్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేశారు మేకర్స్ . ఈనెల 21న ఈ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో కథానాయకుడి తల్లిదండ్రులుగా సీనియర్ నటుడు ఆలీ మరియు రజిత నటిస్తుండటం విశేషం. వీరితో పాటు రఘుబాబు, గుండు సుదర్శన్ వంటి నటులు ఇతర కీలక పాత్రల్లో నవ్వింబోతున్నారు. దొంగతనం మరియు రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డ్రామాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను మిక్స్ చేసి, వినోదానికి ఎక్కడా లోటు లేకుండా దర్శకుడు శ్రీను కంబాల ఈ చిత్రాన్ని చాలా ఆసక్తికరంగా రూపొందించినట్లు సమాచారం. ఆలీ కామెడీ టైమింగ్ మౌళి పాత్రతో తోడై థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది.

సాంకేతికంగా కూడా ఈ చిత్రం ఎంతో బలంగా రూపుదిద్దుకుంటోంది. సింజిత్ యెర్రమిల్లి సంగీతం అందిస్తుండగా, సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తుండటంతో సినిమాపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ 2026 నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.