జనవరి 12 విడుదల నుండి కీర్తి పోస్టర్ రిలీజ్

Keerthy Suresh’s Poster from January 12 Vidudala Unveiled

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘జనవరి 12 విడుదల’ చిత్రానికి సంబంధించి మేకర్స్ అప్‌డేట్‌ను అందించారు. నటి కీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో కీర్తి సురేశ్ ‘లతా రెడ్డి’గా రైతు బిడ్డ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తి సురేశ్ నటిస్తుండగా, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. ఇప్పటికే ఈ క్రేజీ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనగా, తాజా పాత్ర పరిచయం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అన్ని హంగులతో ఈ చిత్రం 2027 జనవరి 12న సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.