బుల్లి తెరపై, వెండి తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మంచు వారసురాలు.. మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ. అంతేకాదు గత ఏడాది డిజిటల్ మీడియాలోకి కూడా అడుగుపెట్టారు. మిసెస్ సుబ్బలక్ష్మి అనే వెబ్ సిరీస్ లో నటించింది. వంశీ దర్శకత్వంలో రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌లో మంచు లక్ష్మి టైటిల్ రోల్ ప్లే చేశారు. శ్రీనివాస్ అవసరాల, వేణు టిల్లు, మహేష్ విట్ట, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావ్, చిత్రం శ్రీను కీలక పాత్రలు పోషించారు. ZEE5 యాప్ ద్వారా మిసెస్ సుబ్బలక్ష్మి ఎపిసోడ్స్‌ని చూడొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అయిపోయింది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది మంచు లక్ష్మి. కొత్త పాత్రలో నటిస్తున్నానని.. ఈ డైరెక్టర్ తో పని చేస్తున్నందుకు చాలా ఎగ్జైట్ గా ఉందని.. డిటైల్స్ మాత్రం ఏం చెప్పకుండా ట్విట్టర్ లో పేర్కొంది. మరి ఈ వెబ్ సిరీస్ ఏంటో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
Playing a new character, new dialect, ott platform. A director I’m so excited to work with. This is going to be fun. I’ve got a lot of people to channel into this character.. its upto u to guess.. vait seyundri…
— Lakshmi Manchu (@LakshmiManchu) January 4, 2020
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























