బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తుండగా… గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా అఖిల్ ఒక సినిమా చేస్తూనే మరోపక్క కొత్త కథల కోసం చూస్తున్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం తమిళ్ డైరెక్టర్ మిత్రన్ తో కలిసి ఓ సినిమా చేయనున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా మిత్రన్ సినిమాకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అఖిల్ కు అంతకుముందే మిత్రన్ ఓ కథను వినిపించగా.. అందులో కొన్ని మార్పులు చేయమన్నాడట. అఖిల్ చెప్పిన మార్పులు చేయడంతో అఖిల్ కు అలాగే నాగార్జునకు కూడా చెప్పడంతో.. నాగ్ కు కూడా నచ్చడంతో ఓకే చెప్పేశాడట.
కాగా ప్రస్తుతం శివ కార్తికేయన్‌తో ‘హీరో’ సినిమాని తెరకెక్కిస్తున్నారు మిత్రన్. వారి వారి సినిమాలు పూర్తి చేసిన తర్వాత వీరిద్దరి కొత్త సినిమా మొదలవుతుందని తెలిసింది. అంతేకాదు తమిళ, తెలుగు రెండు భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారట. ఇది నిజమో?కాదో? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఆగాల్సిందే. ఇక వరుసగా మూడు ఫ్లోప్స్ అందుకున్న అఖిల్ ఒక హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. మరి అఖిల్ కోరిక ఈ సినిమాతో అయినా తీరుతుందో..? లేదో..?
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























