యదార్ధ సంఘటన ఆధారంగా రవిబాబు దర్శకత్వంలో ‘ఆవిరి’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో సినిమాపై అంచనాలు పెంచేసాడు రవిబాబు. ‘స్పాట్ స్పిరిట్’ అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ లాక్ అయినట్టు తెలుస్తుంది. కేవలం 112 నిమిషాల 37 సెకండ్లు మాత్రమే ఈ సినిమా నిడివి ఉంది. అంటే కేవలం 2 గంటలకంటే తక్కువ మాత్రమే ఉంటుందన్నమాట. మరి హార్రర్ సినిమాలు నిడివి ఎంత తక్కువ ఉంటే అంతే మంచిది. అది దృష్టిలో పెట్టుకొనే రవిబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో రవిబాబుతో పాటు నేహా చౌహన్, శ్రీముక్త, భరణి శంకర్, ముక్తర్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు తన సొంత బేనర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ మీదుగా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 1న విడుదల చేయనున్నారు.
గతంలో లడ్డు బాబు, అవును 2, అదుగో సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో…. ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలి అని చూస్తున్నాడు రవిబాబు. మరి చూద్దాం ‘ఆవిరి‘ సినిమా రవిబాబుకు ఎంత సక్సెస్ తెచ్చిపెడుతుందో.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: