అట్లీ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘బిగిల్’. తెలుగులో ‘విజిల్’ అనే పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. తెలుగు వెర్షన్ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ సినిమా పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమా లో విజయ్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. ఏజీయస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. తెలుగులో ఈ సినిమా హక్కులు ఈస్ట్ కోస్ట్ బ్యానర్ దక్కించుకుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు ఇందులో మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు దళపతి. ఈ సినిమాలో రాజప్ప అనే మాస్ పాత్రలోను .. మైఖేల్ అనే ఫుట్ బాల్ కోచ్ పాత్రలోను విజయ్ కనిపించనున్నాడు.
ఇక ఇప్పటికే వీళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తెరి(పోలీస్), మెర్సల్(అదిరింది) సినిమాలు సూపర్ హిట్ అవ్వగా.. ఇది మూడూ సినిమా కావడం తో దీనిపై కూడా మంచిఅంచనాలు ఉన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























