సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కిన సైరా సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా తర్వాత చిరు కొరటాల శివతో సినిమా చేస్తున్నట్టు ఇప్పటీకే వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. నవంబర్లో ఈ సినిమా షూటింగ్ ను మొదలపెట్టనున్నారు. ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటించనుంది.
ఇదిలా ఉండగా కొరటాల సినిమా తర్వాత చిరు త్రివిక్రమ్ తో చేయనున్నట్టు తెలుస్తుంది. సైరా ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న చిరునే ఈ కాంబినేషన్ పై మాట్లాడటంతో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. త్రివిక్రమ్ తనకి ఇటీవల ఒక లైన్ వినిపించాడని.. ప్రస్తుతం కథను పూర్తి చేసే పనిలో ఉన్నాడు… పూర్తి వినోదభరితంగా ఆ కథ నడుస్తుందని అన్నారు. మరి ఈ సినిమాపై మరింత క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: