యువ కథానాయకుడు నాగచైతన్య, డ్యాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ వద్ద సహాయకుడిగా పనిచేసిన పవన్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ డ్యాన్స్ బేస్డ్ లవ్ స్టొరీలో… చైతు, సాయిపల్లవి ఇద్దరూ తెలంగాణ యాస మాట్లాడే ప్రొఫెషనల్ డ్యాన్సర్స్‌గా దర్శనమివ్వనున్నట్టు తెలుస్తోంది.
కాగా… ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 5 నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అంతేకాదు… కేవలం 60 నుంచి 70 రోజుల్లోనే చిత్రీకరణను పూర్తి చేసి… ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
సాయిపల్లవి నాయికగా నటిస్తున్న ‘విరాటపర్వం’ చిత్రీకరణ దశలో ఉండగా… తన మేనమామ వెంకటేష్‌తో కలసి చైతు నటిస్తున్న ‘వెంకీమామ’ విజయదశమికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: