తమ అభిమాని చనిపోయిన వార్త విని చలించిపోయారు జూనియర్ ఎన్టీఆర్. తన అభిమాని, ఆప్తుడు కృష్ణా జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి అయిన జయదేవ్ ఈ రోజు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తారక్ ఆయనకు సంతాపం తెలియజేస్తూ భావోద్వేగంతో సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘నాకు అత్యంత ఆప్తుడయిన జయదేవ్ ఇక లేరన్న వార్త తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుందని ఊహించలేదు. ఓ నటుడిగా నా కష్టసుఖాల్లో అభిమానులు నా వెన్నంటే ఉన్నారు. నేను వేసిన తొలి అడుగు నుంచి నేటి వరకు తోడుగా ఉన్నవారిలో జయదేవ్ చాలా ముఖ్యమైన వ్యక్తి. జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు.
దీంతో ‘జూ ఎన్టీఆర్’కు అభిమానులంటే ఎంత అభిమానమో, ఎంతటి గౌరవమో మరోసారి రుజువైంది.
[subscribe]
[youtube_video videoid=fyUeHI5M_d8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























