డిస్కో రాజా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ అప్ డేట్

Ravi Teja Disco Raja Second Schedule Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywwod Cinema News,2019 Latest Telugu Movie News,Ravi Teja Disco Raja Movie Latest Updates,Disco Raja Movie Shooting News,Ravi Teja Disco Raja Movie Shooting Details,Ravi Teja New Movie Updates
Ravi Teja Disco Raja Second Schedule Latest Update

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తరువాత రవితేజ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే డిస్కో రాజా లాంటి వైవిథ్యమైన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విలక్షణ దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఈ సినిమాకి దర్శకుడు. పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈసినిమా కొద్ది రోజులు షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కాని ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్టు.. బడ్జెట్ విషయంలో విబేధాలు తలెత్తాయని ఫిలిం వర్గాల్లో ప్రచారం జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గతంలో రవితేజతో ‘నేల టిక్కెట్’ మూవీ చేసిన రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్ అంచనాతో మొదలు పెట్టారట. నిర్మాత తాజాగా బడ్జెట్ రూ. 30 కోట్లకు కుదించడంలో భాగంగా కొన్ని పాటలు, విఎఫ్ఎక్స్ తీసేయాలని అనుకుంటున్నారట. మరికొన్ని సీన్ల విషయంలో కూడా మార్పులు చేయాలని కోరుతున్నాడట. ఈ విషయంలోనే రవితేజకు, నిర్మాతకు మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం.

అంతేకాదు ఈ నేపథ్యంలో పలు డైరెక్టర్లు రవితేజ తో సినిమా చేయడానికి పోటీ పడుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అందులో అజయ్ భూపతి .. గోపీచంద్ మలినేని .. సంపత్ నంది పేర్లు వినిపించాయి. వారు తమ దగ్గరున్న కథలతో రవితేజను ఒప్పించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

ఇక ఇప్పుడు ఈ వార్తలకు బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ను మే 27నుండి ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సినిమా షూటింగ్ ను పూర్తిచేసి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. మరి దీంతో ఇప్పటికైనా రూమర్లకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం..

కాగా ఈ సినిమాలో ఈ చిత్రంలో ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ్‌పుత్, నభా నటేష్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు నటిస్తున్నారు.

[subscribe]
[youtube_video videoid=oz2otTIhD_k]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =