ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న అలియాస్ రుక్మిణీ

Alias Rukmini Completes Its First Schedule

‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ అద్భుత విజయం తర్వాత న్యాచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్, నితిన్ హీరోగా నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణీ’ సరికొత్త ప్రాజెక్ట్‌తో వస్తోంది. తన తొలి చిత్రం ‘దండోరా’తో విమర్శకులను ఆకట్టుకున్న మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. దీప్తి గంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఒక ఆసక్తికరమైన కథతో కూడిన విలక్షణమైన ప్రపంచాన్ని ఆవిష్కరించేలా ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘అలియాస్ రుక్మిణి’ 10 రోజుల మొదటి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. చిత్ర బృందం ప్రధాన తారాగణంతో కూడిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. ఈ షూట్‌లో హీరో నితిన్‌తో పాటు సాయి కుమార్, హర్ష వర్ధన్, ఇతర ప్రముఖ నటులు పాల్గొన్నారు.

యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాని సమర్పకుడిగా వ్యవహరించడం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది. లైట్ హార్ట్ హాస్యంతో కూడిన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమాలో నితిన్ చాలా యూనిక్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.