కార్తికేయ 2తో పాన్-ఇండియా స్థాయిలో ఘన విజయాన్ని అందుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్ సగర్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం నుంచి మేకర్స్ ఒక బిగ్ అప్‌డేట్‌ను పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా చిత్రీకరణ సుదీర్ఘంగా 175 రోజుల పాటు సాగిందని, విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఏకంగా 2500కు పైగా సీజీ (CG) షాట్స్‌ను రూపొందించినట్లు నిఖిల్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. గ్రాండ్ విజువల్స్, అద్భుతమైన బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి వేగంతో జరుపుతున్నామని, అధికారిక విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
ఈ చిత్రంలో సంయుక్త మీనన్ యోధురాలి పాత్రలో (‘భూమి’) కనిపిస్తుండగా, నభా నటేష్ మరొక కథానాయికగా నటిస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం విడుదలకు సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























