విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ (AK-47) అఫీషియల్ టీజర్ విడుదలైంది .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టీజర్లో ఒకవైపు మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు, నవ్వులు పూయించే వినోదాన్ని చూపిస్తూనే , మరోవైపు ఊహించని యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కట్ చేశారు. “నది కట్టు దాటితే వరద అంటారు.. అదే సముద్రం దాటితే ఉప్పెన అంటారు.. కానీ సామాన్యుడు దాటితే బలమైన పదం, స్ట్రాంగ్ సౌండ్ వచ్చేది” అంటూ వెంకటేష్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది .ఓవరాల్ గా టీజర్ సినిమాపై వున్న అంచనాలను రెట్టింపు చేసింది.
ఇందులో వెంకీ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తుండగా రోహిత్ నారా కీలక పాత్రల్లో కనిపించనున్నాడు. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది . సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























