విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆల్కహాల్’. మొదటి నుంచీ ఇంట్రెస్టింగ్ టైటిల్ మరియు ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ పెంచుతున్న ఈ సినిమా విడుదల తేదీపై చిత్ర యూనిట్ తాజాగా అధికారిక ప్రకటన చేసింది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెహర్ తేజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రుహాని శర్మ, నిహారిక ఎన్ఎమ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.
ఈ చిత్రానికి ఛైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, జిబ్రాన్ వైబోధ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. విడుదల తేదీ ప్రకటనతో పాటు మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను మరింత వేగవంతం చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. డిసెంబర్ 18న బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























