జన నాయకుడు సెన్సార్ వివాదంపై స్పందించిన నిర్మాత కేవీఎన్

Producer KVN Responds to the Jana Nayakudu Censor Controversy

తమిళనాడు ముఖ్యమంత్రి , దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్ ‘ రేపు విడుదలకానుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా జన నాయగన్ నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కే నారాయణ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈ సినిమాకి ఎదురైన సెన్సార్ సవాళ్లు మరియు జాప్యంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెన్సార్ బోర్డు సూచించిన మార్పులపై ఆయన స్పందిస్తూ.. సినిమాలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగానికి మరియు విజయ్ రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) విధానానికి మధ్య ఉన్న ఒక కీలకమైన డైలాగ్‌పై అభ్యంతరం వ్యక్తమైందని వెల్లడించారు. “అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పాటించకపోతే టీవీకే) రాజ్యాంగం వర్తిస్తుంది” అనే తరహాలో ఉన్న ఆ సంభాషణను మార్చాలని సూచించడంతో, చట్టానికి కట్టుబడి తగిన మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా, అంబేడ్కర్ పుస్తక కవర్‌ను మార్చడం, కొన్ని ఆధ్యాత్మిక పదాలను (భగవాన్, రంగనాథర్, ఓం) మ్యూట్ చేయడం సహా దాదాపు 20 సెకన్ల సీన్లను కట్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమా కథ వెండితెరపై నుంచి నిజ జీవితంలోకి సరిగ్గా సరిపోయే రీల్-టు-రియల్ స్టోరీ అని నిర్మాత అభివర్ణించారు. “మేము ఈ సినిమా ప్రారంభించినప్పుడు ఇది ఈ స్థాయిలో పాలిటిక్స్‌తో ముడిపడుతుందని అనుకోలేదు, నిజ జీవితంలోనూ ఆయన నాయకుడిగా ఎదగడం ఈ చిత్రానికి సరికొత్త అర్థాన్ని తెచ్చింది” అని వ్యాఖ్యానించారు. ఎన్నో ప్రతిబంధకాలను దాటుకుని వస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.తెలుగులో ఈసినిమా జన నాయకుడు గా రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.