‘లెనిన్’ సక్సెస్ మీట్ లో కింగ్ నాగార్జున వేదికపై చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. తన కెరీర్‌లో ఎన్నోసార్లు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లినప్పటికీ, దేవుడిని ఎప్పుడూ తన స్వార్థం కోసం గానీ, వ్యక్తిగత విషయాల కోసం గానీ ఏమీ కోరుకోలేదని ఆయన వెల్లడించారు. కానీ, ఒక తండ్రిగా తన జీవితంలోనే మొదటిసారిగా ఆ స్వామి వారిని ఒక కోరిక కోరుకున్నానని, “మా వాడికి (అఖిల్‌కు) ఒక హిట్ ఇవ్వండి” అని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు నాగార్జున పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాను కోరుకున్నట్లే అఖిల్‌కు ‘లెనిన్’ రూపంలో ప్రేక్షకులు ఒక అద్భుతమైన విజయాన్ని అందించడంతో, తన ప్రార్థనను ఆలకించిన ఆ తిరుమల వేంకటేశ్వర స్వామికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పెళ్లయ్యాక అఖిల్ టైమ్ మారిందని, అతని కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఈ సక్సెస్ వేడుకలో తన “పెద్ద అబ్బాయి” ఎన్టీఆర్ (తారక్) కు కూడా నాగార్జున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం విశేషం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























