ఎపిక్ అడల్ట్ ఫిల్మ్ కాదు.. స్వచ్ఛమైన ప్రేమకథ – సూర్యదేవర నాగవంశీ

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్.ఈనెల 11న ఈసినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిన్న ఈసినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ జరుగగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఇక ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ ..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమాకు వచ్చిన సెన్సార్ సర్టిఫికేషన్ గురించి నాగవంశీ స్పందిస్తూ, ట్రైలర్‌లో కనిపించిన ఒక ముద్దు సన్నివేశం ఆధారంగా దీనిని అడల్ట్ ఫిల్మ్‌గా భావించవద్దని ప్రేక్షకులను కోరారు. సినిమాలో అశ్లీలత ఏమీ లేదని, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అమ్మాయిని కలవడం, ప్రేమించడం సహజమని, ఒక అబ్బాయి మరియు అమ్మాయి మధ్య ఉండే బంధాన్ని ఈ చిత్రంలో చాలా స్వచ్ఛంగా, సహజంగా చూపించామని తెలిపారు.

గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘ఏ మాయ చేసావే’ వంటి క్లాసిక్ ప్రేమకథలను చూసినప్పుడు తమకు కూడా అలాంటి ప్యూర్ లవ్ స్టోరీ నిర్మించాలనే ఆశ ఉండేదని, ‘ఎపిక్’ చిత్రంతో ఆ కోరిక నెరవేరిందని ఆయన వ్యాఖ్యానించారు. రెండు గంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో దాదాపు గంటా నలభై నిమిషాలు ఆనంద్, వైష్ణవిల మధ్య సంభాషణలే ఉంటాయని, ఆ మాటలకు ప్రేక్షకులు ఎంతలా కనెక్ట్ అయితే సినిమా అంత పెద్ద విజయాన్ని సాధిస్తుందని చెప్పారు.

తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక అమాయకమైన అబ్బాయి, స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయితో ప్రేమలో పడినప్పుడు జరిగే పరిణామాలను దర్శకుడు ఆదిత్య హాసన్ అద్భుతంగా ఆవిష్కరించారని ప్రశంసించారు. భాగస్వాములను ఎలా అర్థం చేసుకోవాలి మరియు గౌరవించాలి అనే మంచి సందేశం కూడా ఇందులో ఉందని తెలిపారు. సినిమాలోని ఎమోషనల్ సీన్లు ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.