ఆకట్టుకుంటున్న అంతా రాములోరు చూస్కుంటారు టైటిల్ గ్లింప్స్

సంగీత్ శోభన్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆసక్తికరమైన చిత్రానికి ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర బృందం టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘కుమారి 21ఎఫ్’, ‘రంగరంగ వైభవంగా’ చిత్రాల ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్, విజిబి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

‘మీట్ మారుతి – ఎ నాట్ హిస్ లవ్ స్టోరీ’ అనే క్యాప్షన్‌తో మొదలైన ఈ గ్లింప్స్ ఎంతో ఆహ్లాదకరంగా, ఫీల్ గుడ్‌గా సాగింది. పడవలో ప్రయాణిస్తూ మారుతి (సంగీత్ శోభన్), శిరీష (అనస్వర రాజన్)ల మధ్య జరిగే సంభాషణలు, వారి మధ్య ఉన్న క్యూట్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ‘నువ్వు నవ్వితేనే తింటా’ అంటూ అనస్వర చెప్పే డైలాగులు, దానికి సంగీత్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ఎంతో సహజంగా ఉన్నాయి.

మిక్కీ జె మేయర్ అందించిన ఆహ్లాదకరమైన వింటేజ్ శైలి సంగీతం, మహేంద్రన్ జయరాజు సినిమాటోగ్రఫీ ఈ గ్లింప్స్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సరికొత్త ప్రేమకథాంశంతో రాబోతున్న ఈ చిత్రంపై గ్లింప్స్ ద్వారా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.