పోస్టర్ మీద ఊరికే బ్లాక్‌బస్టర్ వేయలేదు  – నాగవంశీ 

Producer Naga Vamsi’s Speech at the Lenin Success Meet

నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైన అఖిల్ అక్కినేని లెనిన్ సూపర్ హిట్ టాక్ తో మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుండడంతో చిత్ర యూనిట్ ఈరోజు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఈచిత్ర నిర్మాతల్లో ఒకరైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సక్సెస్ మీట్‌లో తనదైన శైలిలో మాట్లాడారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చాలా సినిమాలు పోస్టర్లపై ‘బ్లాక్‌బస్టర్’ అని ఊరికే వేసుకుంటాయని, దానివల్ల చాలాసార్లు ఎటకారాలు కూడా జరుగుతుంటాయని, కానీ నిజమైన బ్లాక్‌బస్టర్ అంటే ఏంటో ‘లెనిన్’ కలెక్షన్లు చూసి తెలుసుకోవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత మూడు నాలుగు నెలలుగా థియేటర్లకు జనం రావడం లేదనే పరిస్థితి నుంచి, ఈరోజు ‘లెనిన్’ కోసం థియేటర్లు పెంచాలనే స్టేజ్‌కి రావడం చాలా గర్వంగా ఉందన్నారు.

గుంటూరు డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడూ ఏడుపు మొహమే వేసుకుని ఉంటాడని, కానీ ఆయన కూడా ఈరోజు ఉదయం నుంచి షోలన్నీ ఫుల్స్ అవుతున్నాయని ఎంతో ఉత్సాహంగా ఫోన్ చేసి చెప్పాడని నాగవంశీ సరదాగా వ్యాఖ్యానించారు. సాధారణంగా ‘బాహుబలి’, ‘RRR’ లాంటి భారీ సినిమాలు వచ్చినా అంతగా ఎగ్జైట్ అవ్వని ఎల్‌వీఆర్ (LVR) వంటి సీనియర్ డిస్ట్రిబ్యూటర్ల గొంతులోనే ఈరోజు ‘లెనిన్’ సక్సెస్ చూసి అంతటి ఉత్సాహం కనిపించిందని గుర్తు చేసుకున్నారు.

అఖిల్ ఈ సినిమా కోసం ఒక కొత్త హీరోలా పట్టుదలతో కష్టపడ్డాడని, గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన అబ్బాయిలా కాకుండా కంటెంట్‌ను నమ్మి ప్రాణం పెట్టాడని నాగవంశీ కొనియాడారు. ప్రేక్షకులు కంటెంట్‌ను మెచ్చి సినిమాను భారీ హిట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ మూవీ అఖిల్ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందని స్పష్టం చేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.