కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘జన నాయగన్’ . గత కొన్ని నెలలుగా సెన్సార్ ఇష్యూస్, లీకేజీలు మరియు కోర్టు కేసుల వంటి పలు వివాదాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాకు ఎట్టకేలకు క్లియరెన్స్ లభించింది. సెన్సార్ బోర్డు సూచించిన మార్పులన్నింటినీ పూర్తి చేసి, అఫీషియల్ సర్టిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవడంతో చిత్ర యూనిట్ మరియు అభిమానులు ఎట్టకేలకు పెద్ద ఊపిరి పీల్చుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి కొన్ని డైలాగులు, పొలిటికల్ రిఫరెన్స్ కట్స్ తర్వాత ‘A’ (అడల్ట్) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. దాదాపు 3 గంటల 3 నిమిషాల (183 నిమిషాలు) సుదీర్ఘ రన్టైమ్తో రాబోతున్న ఈ చిత్రం విజయ్ కెరీర్లోనే దాదాపు 24 ఏళ్ల తర్వాత ‘A’ రేటింగ్ తెచ్చుకున్న రెండవ సినిమా కావడం గమనార్హం.
హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ డ్రామాలో బాబీ డియోల్, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సెన్సార్ అడ్డంకులు అన్నీ తొలగిపోవడంతో ‘జన నాయగన్’ వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ లాక్ చేశారని సమాచారం. విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళకముందు సైన్ చేసిన చివరి సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని రాబోయే జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో చూడాలి.తెలుగులో ఈసినిమా జన నాయకుడు గా విడుదలకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























