విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ విజువల్ వండర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిర్మాత సురేష్ బాబు ఈ వేడుకకు ముఖ్య అతిథి గా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మీట్ లో నిర్మాత కిషోర్ మాట్లాడుతూ… రూ.110 కోట్లకు పైగా పెట్టి తీసిన సినిమా ఇది. ఈ రోజుల్లో సినిమాకి మూడు రోజులే లైఫ్. ఆ మూడు రోజుల్లో ఏదైనా జరగొచ్చు. అందుకే కొద్ది రోజులుగా కొంచెం టెన్షన్ పడ్డాను. అయితే ఫైనల్ మిక్స్ అయిన తర్వాత అభిషేక్ సినిమా చూపించారు. ఇప్పుడు నాకున్న టెన్షన్ అంతా పోయింది. మీరు ఒక విజువల్ వండర్‌ను చూడబోతున్నారు. సినిమా ట్రెమండస్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ప్రతి 10 నిమిషాలకు ఒక డిఫరెంట్ వరల్డ్‌ను చూస్తారు. ఒక సినిమాలోనే నాలుగైదు విజువల్ వండర్స్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ చాలా సాటిస్ఫై అవుతారు. కచ్చితంగా ఇది ష్యూర్‌షాట్ బ్లాక్‌బస్టర్.
నిర్మాత నిశిత మాట్లాడుతూ… నిర్మాతలుగా ఈ సినిమా మీద మేము పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్నాము. ఆ కాన్ఫిడెన్స్‌కు కారణం మేము ఇచ్చిన అవుట్‌పుట్ ఏంటో మాకు తెలుసు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాకి దేవుడే మా ఫస్ట్ హీరో. మా డైరెక్టర్ అభిషేక్ గారు సెకండ్ హీరో. స్క్రీన్ మీద మీరు చూసే విరాట్ కర్ణ మరో హీరో. కిషోర్ గారు నాలుగో హీరో. ఆయన ఈ సినిమా కోసం రాత్రింబవళ్లు పనిచేశారు. ఆయన పడిన కష్టాన్ని నేను కళ్లారా చూశాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























